హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉద్యోగం పేరిట రూ.7.35 లక్షలు స్వాహా

RR: ఉద్యోగం,ల్యాప్‌టాప్ ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు కాజేసిన ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు చెందిన ఫ్రీలాన్సింగ్ కన్సల్టెంట్ భాగ్యలక్ష్మిని మాధవి అనే మహిళ నమ్మించి మే, జూలైల్లో రూ.7.35 లక్షలు వసూలు చేసింది. ఆ తర్వాత ఉద్యోగం ఇవ్వకుండా, ఫోన్, వాట్సాప్‌లలో అందుబాటులోకి రాకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.