ASF: తిర్యాణి మండలం అరటిపల్లి గ్రామంలో మేసినేని చంద్రయ్య ఇంటి పెరట్లో అక్రమంగా సాగు చేస్తున్న 7 గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నమ్మదగిన సమాచారంతో తనిఖీలు చేపట్టి వీటిని గుర్తించినట్లు రెబ్బెన సీఐ సంజయ్ కుమార్ తెలిపారు. పట్టుబడిన మొక్కల విలువ సుమారు రూ. 70 వేలు ఉంటుందన్నారు. చంద్రయ్యపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
ఇంటి పెరట్లో గంజాయి సాగు.. 7 మొక్కలు స్వాధీనం


