హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాత్రూంలో మహిళను వీడియో తీసిన టెక్నీషియన్‌‌పై కేసు

వరంగల్ నగరంలోని ఓ ప్రైవేట్‌ పిల్లల ఆసుపత్రిలో మహిళను రహస్యంగా వీడియో తీస్తున్న ల్యాబ్‌ టెక్నీషియన్‌ కొత్తపల్లి మనోహర్ సిబ్బంది పట్టుకున్నారు. గొర్రెకుంటకు చెందిన గర్భిణి తన కుమార్తె చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చి బాత్రూంకు వెళ్లగా ఈ ఘటన జరిగింది. బాధితురాలి భర్త ఫిర్యాదుతో శనివారం కేసు నమోదు చేసినట్లు మట్టేవాడ ఎస్సై శ్రీనివాస్‌ తెలిపారు.