ASF: వినాయక చవితి సందర్భంగా గణేశ్ మండపాలు, నిమజ్జన మార్గాల్లో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు ఆసిఫాబాద్ SE ఉత్తమ్ జాడే తెలిపారు. మండప నిర్వాహకులు, భక్తులు, విద్యుత్ సిబ్బంది సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విగ్రహాలు, ట్రక్కులు, క్రేన్ల ఎత్తును దృష్టిలో ఉంచుకుని నిమజ్జన మార్గాలను ముందుగానే పరిశీలించాలన్నారు.
తెలంగాణ
విద్యుత్ ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు


