ADB: రాజ్యాంగం కల్పించిన విద్య, వైద్యం, ఉపాధి హక్కులకై యువత సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేస్రం భాస్కర్ పిలుపునిచ్చారు. ఈ నెల 8, 9, 10 తేదీల్లో యాదగిరిగుట్టలో నిర్వహించే ఏఐవైఎఫ్ రాష్ట్ర 3వ మహాసభల వాల్ పోస్టర్ ను ఉట్నూర్‌లో శనివారం ఆవిష్కరించారు. మహాసభలకు యువత పెద్ద సంఖ్యలో తరలిరావాలని విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ
యువత సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి: AIYF


