హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళపై దాడి.. కేసు నమోదు

WGL: సంగెం మండలం గవిచర్ల గ్రామంలో నీటి విషయంలో జరిగిన వివాదంలో మహిళపై దాడి చేసిన వ్యక్తిపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యవసాయ బావి నీటిని వంతుల వారీగా వినియోగించుకునే విషయంలో రావుల రాజు, రఘుపతి మధ్య వివాదం తలెత్తింది. రాజు భార్య జ్యోతి ప్రశ్నించగా రఘుపతి దూషిస్తూ దాడి చేసినట్లు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వంశీకృష్ణ తెలిపారు.