హైదరాబాద్: 28°C
తెలంగాణ

7 నుంచి ప్రత్యేక అవసరాల పిల్లలకు క్యాంపులు

SRD: సంగారెడ్డి జిల్లాలోని ప్రత్యేక అవసరాల పిల్లల కోసం ఈ నెల 7 నుంచి 9 వరకు మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు సమగ్ర శిక్ష సీఎంవో బీమ్ గొండ తెలిపారు. 7న సంగారెడ్డి, 8న ఖేడ్, 9న జహీరాబాద్ భవిత కేంద్రాల్లో క్యాంపులు జరుగుతాయని చెప్పారు. అర్హులైన బాలలకు అవసరమైన పరికరాలను పంపిణీ చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.