హైదరాబాద్: 28°C
తెలంగాణ

హుస్నాబాద్‌లో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

SDPT: హుస్నాబాద్ పట్టణంలో రోడ్డు వెడల్పు, నూతన లైన్ పనుల వల్ల ఆదివారం విద్యుత్ నిలిచిపోనుంది. కేఎన్ఆర్ రోడ్డు నుంచి సబ్‌స్టేషన్ వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 6 వరకు సరఫరా ఉండదు. మోడల్ స్కూల్, జీఆర్‌ రెడ్డి కాలనీ, నేతాజీ నగర్, క్రషర్ ఏరియాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.