హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీసీ డిపోలో ఔట్‌సోర్సింగ్ డ్రైవర్ పోస్టుల భర్తీ..!

MDCL: హకీంపేట్ ఆర్టీసీ డిపో పరిధిలో నిరుద్యోగ డ్రైవర్లకు అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేయుటకు అవకాశం కల్పిస్తున్నట్లు డిపో మేనేజర్ సరితా దేవి తెలిపారు. కనీసం 18 నెలల హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అనుభవం ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు తమ ఆధార్ కార్డ్, ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్‌తో హకీంపేట్ డిపో కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.