హైదరాబాద్: 28°C
తెలంగాణ

తీజ్‌ వేడుకలకు రావాలని హరీశ్‌రావుకు వినతి

SDPT: సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హరీశ్‌రావును సిద్దిపేట గోర్‌ బంజారా అసోసియేషన్‌ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. సెప్టెంబర్‌ 10న ఘనంగా నిర్వహించనున్న రెండవ వార్షికోత్సవ తీజ్‌ నిమజ్జన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని కోరుతూ ఆహ్వాన పత్రిక అందజేశారు. పండుగ విశిష్టతను, వేడుకల ఏర్పాట్లను హరీశ్‌రావుకు ప్రతినిధులు వివరించారు.