హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రామాయంపేటలో ఘనంగా వినాయకుడి ఆగమనం

మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో వినాయక చవితి సంబరాలు అంబరాన్నంటనున్నాయి. పట్టణ యువత ఆత్మీయంగా వెల్కమ్ వినాయక అంటూ స్వామివారికి ఘన స్వాగతం పలికారు. డీజే చప్పుళ్లు, ధూపదీపాలతో మహాగణపతిని తీసుకువచ్చారు, ఈ నవకల్పన వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు వందలాదిగా తరలిరావడంతో రామాయంపేట వీధులన్నీ భక్తిపారవశ్యంతో పులకించిపోయాయి.