హైదరాబాద్: 28°C
తెలంగాణ

బైక్ దొంగల ముఠా అరెస్టు.. వాహనాలు స్వాధీనం

NZB: నగరంలో వాహనాల చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను NZB టూటౌన్ పోలీసులు శనివారం సాయంత్రం అరెస్టు చేశారు. నిందితులను గుమ్ముల వినయ్ దత్త, కోలీ రోహన్, ముక్కల సంతోష్‌గా గుర్తించారు. నిందితుల వద్ద నుంచి మొత్తం 4 వాహనాలను (2 బైక్‌లు,2 స్కూటీలు) స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.14 రోజుల పాటు అబ్జర్వేషన్ హోమ్‌కు పంపించినట్లు తెలిపారు.