హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేకాట రాయుళ్ల అరెస్ట్.. నగదు స్వాధీనం

MDK: చిన్నశంకరంపేట మండల పరిధిలోని సూరారం శివారులో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. విఠల్, గంగాధర్, నర్సింలు, నాగరాజు, దర్శన్‌ల నుండి రూ.10,380 నగదు, పేకముక్కలు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ జూదంపై కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ హెచ్చరించారు.