హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళలకు ఉచిత టైలరింగ్‌ శిక్షణ

వనపర్తి వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్‌ భవనంలోని RSETIలో మహిళలకు ఉచిత టైలరింగ్‌ శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్‌ అనిల్‌కుమార్‌ తెలిపారు. పరిమిత సీట్లు ఉన్నందున ఆసక్తి ఉన్నవారు SSC మెమో, ఆధార్‌, రేషన్‌ కార్డు, బ్యాంకు పాస్‌బుక్‌ జిరాక్స్‌, 3 ఫొటోలతో ఈ నెల 9లోపు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు.