ADB: ఐటీఐ, ఏటీసీ కళాశాలల్లో మూడవ దశ ప్రవేశాలకు ఈ నెల 7 వరకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు ఉట్నూర్ ప్రభుత్వ గిరిజన ఐటీఐ, ఏటీసీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 5 వరకు ఉన్న గడువును రెండు రోజులపాటు పొడిగించారన్నారు. ఇంకా దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు వెంటనే చేసుకోవాలని.. ఏదైనా సమాచారం కోసం కళాశాలలో సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
ఐటీఐలో 3వ దశ ప్రవేశాల గడువు పెంపు


