హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బండ మీద భోజనం... ఆ గ్రామ ప్రత్యేకత

MBNR: కౌకుంట్ల మండలం వెంకటగిరిలో శ్రీ కురుమూర్తి స్వామి పాదం మోపిన ప్రసిద్ధ బండపై గ్రామస్థులు శ్రావణ మాస శనివారం ప్రత్యేక వేడుక నిర్వహించారు. గుడి వద్ద వంటలు చేసి స్వామికి నైవేద్యం సమర్పించి, విస్తరాకులు లేకుండా కులమతాలకు అతీతంగా బండ మీద సహపంక్తి భోజనం చేశారు. ఇలా చేస్తే పాడిపంటలు, వర్షాలు సమృద్ధిగా ఉంటాయని వారి నమ్మకం.