హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీ ఆంజనేయ స్వామికి ఇత్తడి తొడుగు సమర్పణ

PDPL: సుల్తానాబాద్ మండలం మంచరామి గ్రామ శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేకంగా తయారు చేయించిన ఇత్తడి తొడుగు ఆభరణాన్ని సమర్పించారు. సర్పంచ్ ఉప్పు లక్ష్మి ఆధ్వర్యంలో, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి తిరుపతి సహకారంతో దీనిని రూపొందించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.