హైదరాబాద్: 28°C
వార్తలు

'పేదలకు సొంత ఇళ్లు కల్పించడమే లక్ష్యం'

TG: బాన్సువాడ నియోజకవర్గంలో 121 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి మంజూరు పత్రాలు అందజేశారు. వర్ని, చందూర్, మోస్రా మండలాల లబ్ధిదారులకు ఈ పత్రాలు పంపిణీ చేశారు. అలాగే 98 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.30.86 లక్షల విలువైన చెక్కులు అందించారు. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడమే లక్ష్యమని వెల్లడించారు.