హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు రాయికల్‌లో విద్యుత్ సరఫరా నిలిపివేత

JGL: రాయికల్‌ పట్టణంలోని 11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ నవీన్‌ తెలిపారు. 11 కేవీ విద్యుత్‌ లైన్ల కింద ఉన్న చెట్ల కొమ్మలను తొలగించే పనుల కారణంగా ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు.