హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు హిందూపురంలో వైసీపీ సమావేశం

SS: హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని 52 వార్డుల వైసీపీ నాయకులు, కార్యకర్తల సమావేశం ఆదివారం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో సమావేశం జరుగుతుంది. నియోజకవర్గ ఇన్‌చార్జి టీఎన్ దీపిక వేణు రెడ్డి కీలక సూచనలు చేయనున్నారు. మాజీ కౌన్సిలర్లు, మాజీ కోఆప్షన్ సభ్యులు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని కార్యాలయం కోరింది.