హైదరాబాద్: 28°C
తెలంగాణ

లైన్‌మెన్ పోస్ట్ కేటాయించాలని వినతి

JGL: రాయికల్‌ మండలం మైతాపూర్‌ గ్రామానికి లైన్‌మెన్‌ పోస్టు కేటాయించాలని గ్రామ నాయకులు తలారి రాజేష్, గుర్రం మహేందర్‌ కోరారు. శనివారం విద్యుత్‌ శాఖ డీఈ గంగారాంను కలిసి ఎమ్మెల్యే డా. సంజయ్‌కుమార్‌ సిఫార్సు లేఖను అందించారు. గ్రామంలో లైన్‌మెన్ లేక విద్యుత్‌ సమస్యల పరిష్కారంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. త్వరలో పోస్టు కేటాయిస్తామని డీఈ హామీ ఇచ్చారు.