హైదరాబాద్: 28°C
వార్తలు

అనంత లక్ష్మి కళాశాలలో అవగాహన సదస్సు

ATP: అనంతపురం ఇటుకలపల్లి పరిధిలోని అనంత లక్ష్మి ఇంజినీరింగ్ కళాశాలలో పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. సీఐ హేమంత్‌కుమార్ విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకుని బాధ్యతగా ఉండాలని సూచించారు. ర్యాగింగ్, మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలకు దూరంగా ఉండాలన్నారు. శక్తి యాప్, పోక్సో చట్టం, బాల్యవివాహాలు, రోడ్డు భద్రతపై వివరించారు.