హైదరాబాద్: 28°C
వార్తలు

కొండ కావూరులో ఎమ్మెల్యే పర్యటన

PLD: నరసరావుపేట (M) కొండకావూరులో శనివారం ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు కూటమి నాయకులతో కలిసి పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అనంతరం ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి చర్యలు తీసుకోవాలని సూచించారు.