హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్తంభంపల్లిలో 200 ఈత చెట్ల నరికివేత

SRCL: బోయినపల్లిమండలంలోని స్తంభంపల్లి గ్రామంలో గీత కార్మికుల జీవనాధారమైన సుమారు 200 ఈత చెట్లను అక్రమంగా నరికి కాల్చివేసిన ఘటనపై గౌడ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సుమారు 60 మంది గీత కార్మికులు జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ హిమశ్రీ, సిరిసిల్ల ఎక్సైజ్ సీఐ శారదకు వినతిపత్రం అందజేశారు. చెట్ల నరికివేతకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.