హైదరాబాద్: 28°C
వార్తలు

పలు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు

ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఢిల్లీలో వరుసగా రెండో రోజు భారీ వర్షం కురిసింది. 4 గంటలపాటు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించింది. హర్యానాలోని గురుగ్రామ్‌లోనూ వర్షం దంచికొట్టింది. మరోవైపు యూపీలోని ఘజియాబాద్‌లో భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రాజస్థాన్ దౌసా జిల్లాలో గత 24 గంటల్లో 13 సె.మీ వర్షపాతం నమోదైంది.