హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో ఎరువుల కొరత లేదు: కలెక్టర్

సిరిసిల్ల జిల్లాలో ఎరువులకు కొరత లేదని కలెక్టర్ గరిమ అగ్రవాల్ స్పష్టం చేశారు. చందుర్తి పీఏసీఎస్ ను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసి యూరియా నిల్వలు, యాప్ బుకింగ్ వివరాలు పరిశీలించారు. రైతులతో మాట్లాడి సాగు వివరాలు తెలుసుకున్నారు. రైతులు ఆందోళన చెందవద్దని, అధికారులు అందుబాటులో ఉండి సేవలు అందించాలని ఆదేశించారు.