హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజలకు వేగవంతమైన సేవలందించాలి: ఎస్పీ

SRCL: ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే శనివారం వార్షిక తనిఖీల్లో భాగంగా పరిశీలించారు. కేసుల దర్యాప్తు, రికార్డులు, పెట్రోలింగ్, పాత నేరస్తులు,రౌడీషీటర్లపై నిఘాను సమీక్షించారు. సాంకేతికతను వినియోగిస్తూ ప్రజలకు పారదర్శక సేవలు అందించాలని సూచించారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని, డయల్-112 కాల్స్‌పై వెంటనే స్పందించాలని ఆదేశించారు.