హైదరాబాద్: 28°C
తెలంగాణ

మణుగూరులో ఘర్షణ.. వ్యక్తిపై దాడి

BDK: మణుగూరు మండల కేంద్రంలోని స్టేట్‌ బ్యాంక్‌ సమీపంలో శనివారం ఘర్షణ చోటుచేసుకుంది. ఓ ఆటో డ్రైవర్‌ మరో వ్యక్తిపై దాడి చేయడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.