హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

JGL: అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. సారంగాపూర్ మండలంలోని రంగపేటలో రూ.11 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శనివారం భూమి పూజ చేశారు. రూ. 56 లక్షలతో రంగపేట- ఆలూరు వయా బతుకమ్మ కుంట ఫార్మేషన్ రోడ్డును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శేఖర్, ఎంపీడీవో నీరజ, ఎంపీవో సలీం తదితరులు పాల్గొన్నారు.