హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉత్తమ ఉపాధ్యాయురాలు స్వాతికి ఘన సన్మానం

వనపర్తి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికైన శంకరమ్మపేట ఎం.పి.పి.ఎస్. ఉపాధ్యాయురాలు జే. స్వాతి కిరణ్‌ను బీజేపీ మహబూబ్‌నగర్ జిల్లా ఉపాధ్యక్షుడు కొమ్ము భరత్ భూషణ్ ఘనంగా సన్మానించారు. పేద బీడీ కార్మిక కుటుంబం నుంచి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎదగడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.