VKB: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం బోడకొండ అటవీప్రాంత దుర్గం చెరువు సమీపంలో ఒక వింత రాయి పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఇక్కడ ఓ చిన్న బండరాయిపై ఏకంగా 50 అడుగుల ఎత్తున్న భారీ రాయి నిలబడి ఉండటం విశేషం. సమీపానికి వెళ్లి చూస్తే ఓవైపు ఒరిగి.. ఎప్పుడెప్పుడు కింద పడిపోతుందా అన్నట్టుగా ఉంటుంది. ఇదిలా నిలబడటాన్ని అంతా ఆశ్చర్యంగా తిలకిస్తున్నారు.
తెలంగాణ
బాహుబలి రాయిని ఎప్పుడైనా చూశారా!


