హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

HNK: ఆత్మకూరు మండలంలోని అక్కంపేట, చౌల్లపల్లి గ్రామాల్లో వివిధ కారణాలతో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి శనివారం పరామర్శించారు. మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన ఆయన, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.