హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేటీఆర్‌పై కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి ధ్వజం

KNR: ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్‌పై మాట్లాడే హక్కు కేటీఆర్‌కు లేదని మాజీ సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి విమర్శించారు. తమ హయాంలో పేరుకుపోయిన రూ. 5 వేల కోట్ల ఫీజు బకాయిలు, ఇంటర్ ఫలితాల గోల్‌మాల్, టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీలు, వర్సిటీ వీసీల ఖాళీలపై సమాధానం చెప్పిన తర్వాతే కేటీఆర్ కరీంనగర్‌లో అడుగుపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.