PDPL: అంతర్గాం మండల కేంద్రం నుంచి పాలకుర్తి మండలం కుక్కలగూడూరు గ్రామం వైపు వెళ్లే దారిలో బ్రాహ్మణపల్లి గ్రామ శివారులోని మిషన్ భగీరథ పంప్ హౌస్ దారికి సమీపంతో పాటు, పలు చోట్ల బీటీ రోడ్డుపై ఏర్పడిన గుంతలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంతలను తప్పించే క్రమంలో వాహనాలు ఎదురెదురుగా ఢీకొనే ప్రమాద ముందని వాహనదారులు వాపోతున్నారు.
తెలంగాణ
గుంతల రోడ్డుతో ప్రయాణికుల అవస్థలు


