ADB: తాంసి మండలంలోని కప్పర్ల ప్రభుత్వ పాఠశాలలో HM రమేష్ చంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిన్నారులు ఉపాధ్యాయ వేషధారణ ధరించి అందరినీ ఆకట్టుకున్నారు. పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
తాంసిలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు


