హైదరాబాద్: 28°C
తెలంగాణ

హెచ్‌సీఏ టోర్నీలకు మహబూబ్‌నగర్ క్రికెటర్లు

MBNR: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించే ప్రతిష్టాత్మక టోర్నీలకు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఇద్దరు క్రికెటర్లు ఎంపికయ్యారు. అండర్‌-23 ఎమర్జింగ్ టీమ్‌కు అబ్దుల్ రాఫే, సీనియర్ మెన్స్ సూపర్ లీగ్‌కు గణేష్ ఎంపికయ్యారు. వీరి ఎంపికపై ఎంఈడీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం. రాజశేఖర్, ఉమ్మడి జిల్లా క్రికెట్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.