హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బస్సుల ఢీ.. విద్యార్థులకు గాయాలు

SRCL: సిరిసిల్ల కొత్త బస్టాండ్ సమీపంలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యార్థులతో వెళ్తున్న ప్రైవేట్ స్కూల్ బస్సును వేగంగా వచ్చిన అప్పరల్ పార్క్ బస్సు ఢీకొట్టింది. దీంతో స్కూల్ బస్సు కిటికీ అద్దాలు ధ్వంసమై, పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. 108 సిబ్బంది క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.