హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉద్యమకారుల సంఘం అధ్యక్షుడిగా గుంతలి నీలప్ప

NRPT: మక్తల్ నియోజకవర్గ తెలంగాణ ఉద్యమకారుల సంఘం అధ్యక్షుడిగా గుంతలి నీలప్ప ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన సమావేశంలో సంఘ సభ్యులు ఆయనను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నీలప్ప మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారుల హక్కుల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.