హైదరాబాద్: 28°C
తెలంగాణ

కమ్యూనిటీ కాంటాక్ట్‌లో 5 వాహనాలు సీజ్

ADB: సోనాల మండలంలోని కోట-కే గ్రామంలో బోథ్ సీఐ గురుస్వామి, ఎస్సై పురుషోత్తం ఆధ్వర్యంలో వంద మంది పోలీసులతో శనివారం కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నంబర్ ప్లేట్లు లేని 5 వాహనాలను స్వాధీనం చేసుకుని, రూ. 41,315 చలాన్లు వసూలు చేసినట్లు వెల్లడించారు. యువత గంజాయి, గుడుంబాకు దూరంగా ఉండాలని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని పోలీసులు సూచించారు.