మెదక్ జిల్లా రామాయంపేట శివారు 44వ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున భయంకర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి కామారెడ్డి వెళ్తున్న లారీని మరో లోడు లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో రెండూ బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108లో ఆస్పత్రికి తరలించగా, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
ఘోర రోడ్డు ప్రమాదం.. తీవ్ర గాయాలు


