హైదరాబాద్: 28°C
తెలంగాణ

బింగిదొడ్డి తిమ్మప్ప స్వామికి శ్రావణ పూజలు

GDWL: అయిజ మండలం బింగిదొడ్డి పెద్ద చెరువు కట్ట కింద వెలసిన తిమ్మప్ప స్వామి ఆలయంలో శ్రావణమాస పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శనివారం అర్చకులు కోనేరు జలాలతో స్వామివారి స్వయంభువు విగ్రహానికి అభిషేకం చేసి అర్చన, ఆకు పూజ, హోమం నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. రాత్రి అఖండ భజన నిర్వహించనున్నట్లు ఆలయ సేవకులు తెలిపారు.