హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గోదావరిలో గల్లంతైన యువకుడి మృతి

కోనసీమ: యానాం - ఎదుర్లంక GMC బాలయోగి వారధి కింద గోదావరి నదిలో పడవపై నుంచి జారిపడి కర్నీడి శేఖర్ (26) అనే వ్యక్తి మరణించాడు. ఫ్రెండ్ బర్త్‌డే వేడుకల కోసం ఏడుగురు మిత్రులు పడవపై వెళ్లి, మద్యం సేవించి తిరిగి వస్తుండగా కోరింగ నది వద్ద ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, నిన్న మధ్యాహ్నం శేఖర్ మృతదేహం లభ్యమైంది.