హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బురదమయంగా మారిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆవరణం

SRPT: ఇటీవల కురుస్తున్న వర్షాలకు అనంతగిరి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణ పూర్తిగా బురదమయంగా మారింది. దీంతో చికిత్స కోసం వచ్చే రోగులు, ఆసుపత్రి సిబ్బంది రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ఆవరణలో వర్షపు నీరు నిలిచిపోవడంతో జారిపడే ప్రమాదం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మట్టి పోసి ఆవరణను చదును చెయ్యాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.