హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బస్సు ఢీకొని విద్యార్థి మృతి

VSP: తగరపురవలసలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి మృతి చెందాడు. భీమిలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మామిడిపాలెంకు చెందిన చీడి తాతారావు (19) కిరాణా సామగ్రి కోసం తగరపువలసకు వచ్చాడు. ఈ క్రమంలో బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ దివాకర్‌ యాదవ్‌ తెలిపారు.