హైదరాబాద్: 28°C
తెలంగాణ

జలాశయంలోని రంగు మారిన నీరు!

NLG: నాగర్జునసాగర్ జలాశయంలోని నీరు ఆకుపచ్చ రంగులోకి మారడంతో ప్రజలు ఆందోళనకు వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల క్రితం వరకు శుభ్రంగా ఉన్న నీరు దయ్యాలగండి వద్ద ఒక్కసారిగా ఆకుపచ్చగా మారడంతో నీటిలో రసాయనాలు కలిశాయేమోనని ప్రజలు తీవ్ర భయాందళనకు గురవుతున్నారు. ఈ నీటినే సాగర్ కాలనీలకు, రెండు రాష్ట్రాలలోని లక్షలాది ఎకరాలకు సాగు నీటితో పాటు తాగునీరుగా ఉపయోగిస్తారని ప్రజలు వాపోతున్నారు.