హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం పర్యటన నేపథ్యంలో SFI నాయకులు అరెస్ట్

NLG: నకిరేకల్ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను ముందస్తుగా దేవరకొండ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ముందస్తు అరెస్టులకు పాల్పడటం సిగ్గుచేటని జిల్లా ఉపాధ్యక్షుడు బుడిగ వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు రావాల్సిన పెండింగ్ స్కాలర్షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.