హైదరాబాద్: 28°C
తెలంగాణ

టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి..!

HYD: హైదరాబాద్ నల్లకుంట చౌరస్తాలో ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. రెడ్ సిగ్నల్ వద్ద భిక్షాటన చేస్తున్న బర్కత్‌పుర రత్నానగర్‌కు చెందిన నీలయ్య (45) అనే వ్యక్తిని టిప్పర్ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.