హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రైనేజీ లేక ఖాళీ స్థలాల్లోకి వృథా నీరు

NGKL: పెంట్లవెల్లి మండలంలోని పలు వీధుల్లో మురుగు కాల్వలు లేకపోవడంతో ఇళ్లలోని వృథా నీరు పక్కనే ఉన్న ఖాళీ స్థలాల్లోకి చేరుతోంది. బస్టాండ్ వెనక ప్రాంతంలో ఇలా మురుగు నిల్వ ఉంది. దోమల బెడదతో పుల్లయ్యబావి, తిలక్ నగర్, రామాలయం వీధి కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజుల తరబడి మురుగు నిల్వ ఉండటంతో దుర్వాసన భరించలేకపోతున్నామని వాపోతున్నారు.