హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాకు వర్ష సూచన!

NZB: తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాబోయే గంటలో వర్షాలు కొనసాగే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.