హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంగారెడ్డిలో ఐదుగురికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు

SRD: గురుపూజోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లాకు చెందిన ఐదుగురు ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డులకు ఎంపికయ్యారు. ఈ వివరాలను డీఈఓ రోహిణి వెల్లడించారు. ఎంపికైన వారిలో డాక్టర్ జయచంద్ర, డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ వెంకటలక్ష్మి, ప్రధానోపాధ్యాయులు దశరథ్, స్కూల్ అసిస్టెంట్ కీర్తి చంద్రిక ఉన్నారు. విద్యా రంగంలో వీరి సేవలకుగానూ ఈ గౌరవం దక్కింది.